పొగాకు రైతు అయోమయం
వివరాలు 8లో u
●
వర్షంతో ఇబ్బందులు
గతేడాది పొగాకుకు మంచి ధర రావడంతో ఈ ఏడాది గ్రామాల్లో అధికంగా సాగు చేశారు. మేం కూడా కౌలుకు తీసుకొని సాగు చేశా. పంట దిగుబడి పక్కకు పెడితే ఆకులు రాల్పి ఆరబెట్టే సమయంలో వర్షం కురవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఆకు నల్లబడితే తీవ్రంగా నష్టపోతాం.
– మధు ఆచారి, కౌలు రైతు, ఉండవెల్లి
ప్రభుత్వం చొరవ చూపాలి..
పొగాకు అనాధికారిక పంట. గతేడాది ప్రైవేటు కంపెనీల ఆధిపత్య పోరులో భాగంగా క్వింటా రూ.15 వేలు పలికింది. ప్రస్తుతం కూడా క్వింటా రూ.18వేల నుంచి రూ.20వేలకు కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాం. కానీ, రైతుకు భరోసా ఉండేందుకు గతంలో కంపెనీ నిర్వాహకులు అగ్రిమెంట్లు చేసుకునేవారు. ప్రస్తుతం ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదు. ఇప్పటికే పొగాకు సాగుకు కూలీల ఖర్చు అమాంతం పెరిగింది. వర్షాలతో పంట నాణ్యత కొంత తగ్గనుంది. ధరను తగ్గించకుండా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి.
– జీకే.ఈదన్న,
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
ఉండవెల్లి: తుఫాన్ ప్రభావం.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పొగాకు రైతు అయోమయంలో పడ్డాడు. వర్షాలు పడుతుండడంతో పొగాకు మొక్క వాడుపడుతోందని.. రసం కారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట నాణ్యత తగ్గితే మార్కెట్‌లో మద్దతు ధర దక్కుతుందా.. లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, గతేడాది పొగాకు క్వింటా రూ.16 వేలు పలకడంతో రైతులు ఆనందంలో మునిగితేలారు. ఈ ఏడాది పంటకు అధిక ధర పలుకుతుందనే ఆశతో జిల్లాలో కేవలం అలంపూర్ నియోజకవర్గంలోనే కౌలు రైతులు 10వేలకుపైగా పొగాను సాగు చేస్తున్నారు. గతంలో పప్పు శనగలు సాగు చేసిన రైతులు సైతం పొగాకు మంచి డిమాండ్ రావడం, ధర అధికంగా పలుకుతుండడంతో దీనిపై మక్కువ చూపారు. వీరి ఆశలపై తుఫాన్, వరుణుడు నీరు చల్లేలా ఉండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
డిమాండ్ పెరగడంతో..
అలంపూర్ నియోజకవర్గంలోని రైతులే కాదు.. ఈ ప్రాంతానికి సమీపంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోను పొగాకు సాగు పెరిగింది. బయటి దేశాల్లో పొగాకు సాగును బ్యాన్ చేయడంతో రాష్ట్రంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా పొగాకు సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపారు. నియోజకవర్గంలోని అలంపూర్ మండలం లింగన్‌వాయి, కాశాపురంలో వెయ్యి ఎకరాలు, ఉండవెల్లిలో 1500 ఎకరాలకుపైగా సాగు చేశారు. మానవపాడు, చిన్న పోతులపాడు, చెన్నిపాడు గ్రామాల్లో కూడా రైతులు కౌలుకు వేసుకొని మరి సాగు చేస్తున్నారు. కర్నూల్ జిల్లాలో పెద్దపాడు, తాండ్రపాడు, గొందిపర్లలో సాగు చేస్తున్నారని కంపెనీల నిర్వాహకుల లెక్కల ద్వారా తెలిసింది.
22 రకాల పొగాకు సాగు..
ప్రతి మండలంలో 5 రకాల పొగాకులను అధికంగా సాగు చేస్తున్నారు. బీడి, సిగరెట్, తలగరి, చుక్కబర్లి, పొగపొగాకు, తదితర రకాల వాటిని నారుమడులలో సాగు చేసుకుని అనంతరం పంట పొలాల్లో వర్షం పడితే సాగు చేశారు. ఇలా మొత్తం 22 రకాల పొగాను సాగు చేశారు. వీటిని సర్వే చేయడానికి ఫీల్డ్ వర్కర్స్‌ను ఏర్పాటు చేశారు. వారు పరిశీలించి రైతుల ఆధార్ కార్డులను నమోదు చేసుకుని ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తుంటారు. అయితే, కొన్నేళ్ల క్రితం పొగాకును రైతులు సాగు చేసినా ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేయక ఇబ్బందులకు గురిచేశారు. తాజాగా, వర్షాలు కురుస్తుండడంతో మళ్లీ పంట కొనుగోలుకు ఏమైనా ఇబ్బందులకు గురిచేస్తారా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణంలో మార్పులు.. వర్షాలతో పంటపై ప్రభావం
మొక్క వాడుపడుతోందని ఆందోళన
నాణ్యత తగ్గడంతో ధరపై అనుమానాలు
నియోజకవర్గంలో 10వేల ఎకరాల్లో సాగు
Comments
Please login to add a commentAdd a comment