ప్రాథమిక హక్కులపై అవగాహన అవసరం
అలంపూర్: రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని.. ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛగా జీవించే అవకాశం రాజ్యాంగం కల్పించిందని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్ పట్టణంలోని జూనియర్ సవిల్ కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ.. రాజ్యాంగంలో ప్రతి ఒక్క వ్యక్తికి సమాజంలో స్వేచ్ఛ, గౌరవం, సమానత్వంతో జీవించే హక్కు కల్పించిందన్నారు. కోర్టులో ముద్దాయిలను హాజరుపరిచినప్పుడు పోలీసులు ఏమైనా కొట్టారా.. ఎవరైనా ఇబ్బంది పెట్టారా.. బలవంతం చేశారా అని అడగడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా వారి హక్కులకు భంగం వాటిల్లిందేమో అని తెలుసుకోవడానికే అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, ఏజీపీ మధు, ఏఎస్‌ఐ ఎస్‌ఎం బాష, న్యాయవాదులు రాజేశ్వరి, నారయణ రెడ్డి, యూదుర్ బాష, తిమ్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసులు , కరుణాకర్ రావు, వెంకటేష్, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment