గద్వాల: టీజీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలు ఈనెల 15, 16వ తేదీలలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 పరీక్షలు రెండు రోజుల పాటు నాలుగు దఫాలుగా నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు రెండు సెషన్లలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని, డిసెంబర్ 15వ తేదీన ఉదయం 10గంటల నుంచి 12:30గంటల వరకు పేపర్–1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పేపర్–2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, డిసెంబర్ 16వ తేదీన ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పేపర్–3 ఎకానమీ అండ్ డెవ్‌లప్‌మెంట్, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పేపర్–4 తెలంగాణ మూమ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్‌పై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 9160 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను ఈనెల 9వ తేదీ నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment