కొనసాగుతున్న ‘సమగ్ర’ సమ్మె
కామారెడ్డి టౌన్: విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం రెండోరోజు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 750 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. వీరి సమ్మెతో విద్యావనరుల కేంద్రాలు, భవిత కేంద్రాలకు తాళాలు పడ్డాయి. కేజీబీవీలో విద్యాబోధన ముందుకు సాగడం లేదు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుషాల్, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవులా సమ్మెకు మద్దతు తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, శ్యాం కుమార్, సంపత్, శ్రీధర్ కుమార్, రాములు, సంతోష్‌రెడ్డి, శిల్ప, లావణ్య, సాయిలు, శైలజ, మాధవి, అజిద్, శ్రీనివాస్, రమేష్, కాళిదాసు, కృష్ణ, శ్రీకాంత్, బన్సీలాల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment