కామారెడ్డి క్రైం: గ్రూప్–2 అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. పరీక్ష కేంద్రాలలోకి సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఈనెల 15, 16 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం సెషన్‌లో 8.30 గంటలనుంచి, మధ్యాహ్నం సెషన్‌లో 1.30 గంటలనుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేటు మూసివేస్తామని, ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని తెలిపారు. అభ్యర్థులు ఫొటోతో కూడిన హాల్ టికెట్, ప్రభుత్వం జారీచేసిన ఒరిజినల్ ఫొటోతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు. మెహందీ, టాటూ వంటివి పెట్టుకోవద్దని పేర్కొన్నారు. 190 మంది దివ్యాంగ అభ్యర్థులకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వింగ్ ఏ, బీ గదులను ఏర్పాటు చేశామని తెలిపారు. అంధులు, పరీక్ష స్వయంగా రాయలేని వారికోసం 23 మంది సహాయకులను నియమించామని వివరించారు.
సర్వేకు సహకరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు సర్వేకు సహకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. అధికారులు సర్వేకు వచ్చినప్పుడు దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఇంటి వద్ద ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, ఇంటిపన్ను రసీదు, పట్టా పాస్ బుక్కు, భూమి యాజమాన్య పత్రం, పొజిషన్ సర్టిఫికెట్‌లను చూపించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment