కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలను పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశంలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, నూతన డైట్ మెనూ పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం, సంక్షేమ హాస్టళ్ల తనిఖీలు తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈనెల 14 న జరిగే డైట్ చార్జీల పెంపు ప్రారంభో త్సవ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment