వ్యవసాయ గణాంకాల నమోదుపై శిక్షణ
కామారెడ్డి క్రైం: వ్యవసాయ గణాంకాల నమోదుపై వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు బుధవారం కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గణాంక శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రతి మూడేళ్లకోసారి వ్యవసాయ గణాంకాలను సేకరిస్తామన్నారు. ఈ ప్రక్రియ మూడు విడతల్లో సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 2021 లో మొదటి విడత పూర్తయ్యిందని, ఇప్పుడు రెండు, మూడు విడతలకు సంబంధించి వివరాలను సేకరించనున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 118 గ్రామాల్లో ఏఈవోలు పర్యటించి ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలు, దిగుబడులు, సాగు నీటి సౌకర్యాల వివరాలు తదితర అంశాలను నమోదు చేస్తారన్నారు. గణాంక శాఖ అధికారి శేఖర్‌రెడ్డి పలు అంశాలపై ఏఈవోలకు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment