రుద్రూర్: పోతంగల్ సమీపంలో ఉన్న మంజీరా నదిలో ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేసి క్వారీకి వెళ్లే దారిలో నిల్వ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పోతంగల్ తహసీల్దార్ మల్లయ్య పేర్కొన్నారు. ఇసుక డంప్ 20 ట్రాక్టర్ ట్రిప్పుల వరకు ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక డంప్ చేస్తే ట్రాక్టర్లను సీజ్ చేసి, యాజమానులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రాక్టర్ పట్టివేత..
నవీపేట: మండలంలోని జన్నెపల్లి వాగు నుంచి ఇసుకను గురువారం అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదు రావడంతో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న ట్రాక్టర్‌ను తహస్తీల్దార్‌కు అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పేకాటస్థావరంపై దాడి
రెంజల్: మండలంలోని తాడ్‌బిలోలి శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగురిలో ముగ్గురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారైనట్లు ఎస్సై సాయన్న గురువారం పేర్కొన్నారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పేకాట స్థావరంపై దాడి చేశామని వీరి నుంచి రూ. 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment