రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
రెంజల్: మండలంలోని వీరన్నగుట్ట శివారులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మండలంలోని కందకుర్తి నుంచి మద్యం మత్తులో వస్తున్న కృష్ణను వీరన్నగుట్ట గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు నిజామాబాద్ నుంచి తిరిగి వస్తుండగా ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి రెండు కాళ్లు విరిగాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో సకాలంలో చేరుకున్న సిబ్బంది ఈఎంటీ సంజీవ్‌గౌడ్, ఈఆర్‌సీపీ డాక్టర్ శివ ప్రథమ చికిత్సలు అందించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు 108 సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయమై రెంజల్ ఎస్సైని వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment