ప్రభుత్వ పాఠశాల బాలికలకు సైకిళ్ల పంపిణీ
కామారెడ్డి క్రైం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 25 మంది పేద విద్యార్థినులకు కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైకిళ్లను ఉచితంగా అందజేశారు. రోటరీ క్షబ్‌లో గురువారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వరంగల్ సెంట్రల్ క్లబ్ రోటేరియన్ జూలూరు కృష్ణమూర్తి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్ధులకు ఉచితంగా సైకిళ్లను అందించడం అభినందనీయమన్నారు. డీఈవో రాజు, రొటీరియన్ కోరే చంద్రమౌళి, అసిస్టెంట్ గవర్నర్ జ్ఞాన ప్రకాష్, క్లబ్ సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి సబ్బని కృష్ణహరి, సీనియర్ ప్రతినిధి శ్రీశైలం, ప్రోగ్రాం చైర్మన్ పి.సత్యం, ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment