డ్రైవర్ తప్పిదం.. ప్రయాణికుల ఆగ్రహం
భిక్కనూరు: ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భిక్కనూరు టోల్‌ప్లాజా సమీపంలో డీజిల్ లేక ఆర్టీసీ బస్సు ఒకటి నిలిచిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు..బోధన్ డిపో ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్ వెళ్తుండగా భిక్కనూరు టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసేందుకు యత్నించినా స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణికులు కొందరూ డీజిల్ ఉందా లేదా చూడమని డ్రైవర్‌కు సూచించడంతో ఆయన డీజిల్ ట్యాంక్‌ను చెక్ చేశారు. అందులో డీజిల్ లేకపోవడంతో ప్రయాణికులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ లేకుండా బస్సును ఎలా రోడ్డుపై తెచ్చారని కోపడ్డారు. విషయం తెలిసి జీఎంఆర్ సంస్థకు చెందిన నేషనల్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది డీజిల్ తీసుకొచ్చి ట్యాంక్‌లో పోయడంతో బస్సు స్టార్ట్ అయ్యింది. వెంటనే సికింద్రాబాద్ పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment