రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ..
నిజాంసాగర్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కిష్టాపూర్ శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇస్లావత్ సంగ్యానాయక్(55), ఇస్లావత్ లక్ష్మీబాయి(48) భార్యాభర్తలు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. నిజాంసాగర్ మండలం మల్లూర్ తండాకు చెందిన ఇస్లావత్ సంగ్యానాయక్, లక్ష్మీబాయి దంపతులు. వీరు సంగారెడ్డి జిల్లాలోని అనకాపల్లిలో ఉన్న తమ కుమార్తె ఇంటికి ఎక్స్‌ఎల్ మోపెడ్‌పై బయలు దేరారు. కల్హేర్ మండలం కిష్టాపూర్ శివారులో వీరి వాహనాన్ని తారు వాహనం బలంగా ఢీకొన్నది. ఈ ఘటనలో భా ర్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దంపతుల మృతితో తండాలో విషాద చాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment