ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఓపెన్ ఎస్సెస్సీ తెలుగు పరీక్షలో ఒకరి పరీక్షకు మరొకరు పరీక్ష రాసి పట్టుబడిన కేసులో ఇద్దరికి రూ. 10 వేల జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల తీర్పు వెల్లడించారు. వివరాల ప్రకారం.. 2017లో ఆర్మూర్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఓపెన్ ఎస్సెస్సీ తెలుగు పరీక్ష రాయాల్సిన ఎండీ ఫయిజుద్దీన్ అతనికి బదులు ఎండీ ముమిత్ తెలుగు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డాడు. దీంతో పరీక్ష సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్ స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఇరువురిపై చీటింగ్ కేసు నమోదైంది. విచారణలో చీటింగ్ చేసినట్లు రుజువు కావడంతో రూ. 10వేల చొప్పున ఇరువురికి జడ్జి జరిమానా విధించారని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment