వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

Published Fri, Dec 13 2024 1:43 AM | Last Updated on Fri, Dec 13 2024 1:44 AM

వేర్వ

వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదా ల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు..

కామారెడ్డి క్రైం: ఆగి ఉన్న ట్రాక్ట ర్‌ను వెనుక నుంచి ఢీ కొన్న ఓ యువకుడు మృతి చెందిన ఘ టన జిల్లా కేంద్రంలోలోని శాబ్ది పూర్‌ బైపాస్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామానికి చెందిన వడ్ల బాలవ్వ, నర్సింలుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నవీన్‌కుమార్‌(25) కామారెడ్డిలోని ఓ కార్పెంటర్‌ దుకాణంలో దినసరి కూలీగా పనులు చేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి పనులు ముగించుకుని 10 గంటల ప్రాంతంలో బైక్‌పై ఇంటికి వెళ్తుండగా శాబ్దిపూర్‌ బైపాస్‌ ప్రాంతంలో రోడ్డుపై నిర్లక్ష్యంగా ఆగి ఉన్న ట్రాక్టర్‌ను నవీన్‌కుమార్‌ వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మాజీ హోంగార్డు..

కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదంలో ఓ మాజీ హోంగార్డు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం లోని రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం దేమికలాన్‌ గ్రామానికి చెందిన చెవిటోళ్ల బాలయ్య (70) గతంలో హోంగార్డుగా పని చేసి రిటైర్‌ అయ్యాడు. కామారెడ్డికి వచ్చిన అతడు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న ఓ క్రేన్‌ వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన అతడిని స్థానికులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు.

మూర్చతో గేదెల కాపరి ..

మోపాల్‌: మండలంలోని ముదక్‌పల్లికి చెందిన గేదెల కాపరి తోకల నారాయణ(39) మూర్చతో మృతిచెందినట్లు ఎస్సై యాదగిరిగౌడ్‌ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ గేదెలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు వారి పనిలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు గ్రామ శివారుకు గేదెలను తీసుకెళ్లాడు. అతను కొంతకాలంగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. గేదెలను మోపడానికి వెళ్లిన నారాయణ లంబాడి సర్ధార్‌ వ్యవసాయ భూమిలోని నీటి మడిలో మూర్చవ్యాధితో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు నారాయణ కోసం వెతుకుతుండగా, గురువారం ఉదయం నీటి మడిలో పడి మృతిచెంది ఉన్నాడు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వాగులో పడి గుర్తు తెలియని వ్యక్తి..

బోధన్‌టౌన్‌: పట్టణ శివారులోని పసుపువాగులో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. గురువారం పసుపు వాగులో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతిడి వయస్సు 30 ఏళ్ల వరకు ఉంటుందని, సిమెంట్‌ కలర్‌ జీన్స్‌ ప్యాంట్‌తో పాటు గోదుమ కలర్‌ షర్టు, గ్రీన్‌ కలర్‌ బనియన్‌ ధరించి ఉన్నాడని అన్నారు. ఆచూకి తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ పేర్కొన్నారు.

చెరువులో పడి..

జక్రాన్‌పల్లి: మండల కేంద్రానికి చెందిన బండి గంగారాం(60) ప్రమాదవశాత్తు పెద్ద చెరువులో పడి మృతి చెందాడు. జక్రాన్‌పల్లికి చెందిన బండి గంగారాం పని నిమిత్తం పడకల్‌ తండాకు వెళ్లి సైకిల్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో చెరువు వద్ద కాలకృత్యాలకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. నీటిలో ట్రాక్టర్‌ టైర్లతో కూడిన గుంత ఉంది. దీంతో నీటిలో పడగానే ఊపిరాడక మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య భారతి, కుమార్తె సౌమ్య ఉన్నారు.

కారు బోల్తా.. డ్రైవర్‌ మృతి

ఆర్మూర్‌టౌన్‌: పెర్కిట్‌ శివారులోని జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి కారు బోల్తా పడిన ఘటనలో వనపర్తికి చెందిన కారు డ్రైవర్‌ ప్రకాశ్‌(18) మృతి చెందాడు. ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన మద్దెల చందు ఆర్మూర్‌ మండలం కోటార్మూర్‌కు చెందిన స్నేహితుడు అక్షయ్‌ మరదలి వివాహం భీంగల్‌లో ఉండగా హైదరాబాద్‌ నుంచి కారు అద్దెకు తీసుకొని బుధవారం వివాహానికి వచ్చారు. భీంగల్‌ నుంచి పెర్కిట్‌లోని అక్షయ్‌ ఇంటికి చేరుకోగా అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో డ్రైవర్‌ ప్రకాశ్‌తో పాటు మరో ఆరుగురు టీ తాగేందుకు బయలు దేరగా కాంతి స్కూల్‌ సమీపంలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నది. ఈ ఘటనలో డ్రైవర్‌ ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రకాశ్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి1
1/3

వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి2
2/3

వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి3
3/3

వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement