సోయా రైతుల గోస పట్టదా..?
పెద్దకొడప్‌గల్(జుక్కల్): ప్రభుత్వం సోయాకు మద్దతు ధర రూ.4892 కల్పిస్తోంది. దళారులు రూ.వేయి తక్కువగా కోనుగోలు చేయడంతో గత్యంతరం లేక మద్దతు ధర దక్కించుకోవాలనే ఆశతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వరుస కట్టారు. కాని అక్కడ గోనె సంచుల కొరత ఏర్పడడంతో రైతులు ముప్ప తిప్పలు పడుతున్నారు. ఒక్కో రైతు సుమారు రెండు వారాల నుంచి రాత్రింబవళ్ల సోయా కుప్పల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. గోనె సంచులు లేక పెద్దకొడప్‌గల్ సోయా కోనుగోలు కేంద్రంలో తూకం నిలిపివేశారు. ఇప్పటి వరకు 277 మంది రైతుల నుంచి 87,305 బస్తాలు, 41 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇంకా కొనుగోలు కేంద్రం ఆవరణలో సుమారు 12 వేల క్వింటాళ్లకు పైగా సోయాలు ఉన్నాయి. రెండు వారాల నుంచి నుంచి సోయా కుప్పల వద్ద రైతులు రాత్రింబవళ్ల చలిలో పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి గోనె సంచుల కొరతను తీర్చాలని కోరుతున్నారు. గోనె సంచుల కొరతపై సొసైటీ కార్యదర్శి సందీప్‌ను వివరణ కోరగా.. కొన్ని రోజులుగా గోనె సంచుల కొరత ఉంది. ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఇప్పటి వరకు రాకపోవడంతో తూకం నిలిపివేశాం. మా కేంద్రానికి 20 వేల సంచుల అవసరం ఉంటుంది.
గోనె సంచులు రాక ఆగిన తూకం
కుప్పలుగా పోసి ఉంచిన రైతులు
పట్టించుకోని అధికారులు
సంచులు లేవు.. తూకం ఆపేశారు
గోనె సంచులు లేక తూకం వేయడం లేదు. నాకు ఉన్న రెండు ఎకరాలు చేనులో సోయా పంట వేశా. సూమరు 30 బస్తాలు అవుతాయి. గత వారం రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను. ఉన్నత అధికారులు స్పందించి సంచులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కొనుగోలు ప్రారంభించాలని కోరుతున్నాం.
– ఎయిరే శాంతవ్వ, రైతు, పెద్దకొడప్‌గల్
Comments
Please login to add a commentAdd a comment