సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన
కామారెడ్డి టౌన్: తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు చేపడుతున్న సమ్మె శిబిరంలో చాయ్ కప్పులను పైకెత్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ మెరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ .. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘం మహిళా అధ్యక్షురాలు వాసంతి, గౌరవ అధ్యక్షులు శ్రీధర్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సంఘాల మద్దతు
సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు ఎస్‌టీయూ పక్షాన రూ.3 వేలు, బీటీఏ జిల్లా కమిటీ రూ.2 వేలు, టీటీయూ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దిన్ రూ. వేయి అందజేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కృష్ణారావు ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment