భిక్కనూరు: లాటరీ పేరుతో ఓ వ్యక్తి మోసపోయినట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బస్వాపూర్ కు చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు తెలిపారు. ఫోన్‌లో ఈ నెల 4న ఫేస్‌బుక్ చూస్తుండగా లాటరీ అని కనిపించడంతో దానిని క్లిక్ చేశాడు. ఆయనకు వాట్సప్ కాల్ చేసి మీకు రూ. 60 లక్షలు, 10 తులాల బంగారం, ఒక ఐఫోన్ లాటరీ తగిలిందని నమ్మించారు. ఇందుకు గాను ట్యాక్స్‌ల రూపంలో డబ్బులు చెల్లించాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన సదరు వ్యక్తి ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పలు బ్యాంకుల ద్వారా సైబర్ నేరగాళ్లు పంపిన అకౌంట్ నంబర్లకు రూ. 7,20,100 నగదును చెల్లించాడు. తిరిగి వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
మాచారెడ్డిలో..
మాచారెడ్డి: మండల కేంద్రంలో సైబర్ మోసం జరిగినట్లు ఎస్సై అనిల్ గురువారం తెలిపారు. ఎస్సై తె లిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం భవానీపేటకు చెందిన మహేశ్ అనే యువకుడి సెల్‌ఫోన్‌కు ఈ 10న మహిళ పేరుతో హాయ్ అని మెసేజ్ వచ్చింది. దీంతో సదరు యువకుడు మళ్లీ హాయ్ అని బదులిచ్చాడు. కొద్ది సేపు చాటింగ్ చేసి న తర్వాత ఓ లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేస్తే స్టార్ హోటల్లో గదులు ఉచితంగా ఇప్పిస్తామని చెప్పడంతో సదరు యువకుడు లింక్ ఓపెన్ చేయగానే తన ఖాతాలో ఉన్న రూ. 52 వేలు ఖాళీ అ య్యాయి. దీంతో సైబర్ మోసం జరిగినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment