‘విద్యార్థుల్లో మానసిక సంకల్ప సామర్థ్యాలను గుర్తించాలి’
కామారెడ్డి అర్బన్: విద్యార్థుల్లో మానసిక సామర్థ్యాలను గుర్తించి సానుకూలంగా ప్రేరేపిస్తే వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని, చదువులో రాణిస్తారని తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మైండ్ పవర్ స్పెషలిస్ట్, సైకలాజిస్ట్ డాక్టర్ ఎంఏ కరీం అన్నారు. గురువారం స్థానిక బాబాగౌడ్ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులకు మనోవైజ్ఞానిక అవగాహన సదస్సు, సీక్రెట్స్ ఆఫ్ మైండ్ పవర్ అంశంపై కరీం మాట్లాడగా అంతర్జాతీయ మెజీషియన్ రామకృష్ణ ఆనందం కల్గించే ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చారు. సైకలాజిస్ట్ కరీం మాట్లాడుతూ.. పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదువు చదువు అంటూ వేధించవద్దని సూచించారు. ఏకాగత్ర జ్ఞాపకశక్తిపై నిర్వహించిన రాష్ట్రస్థాయి మెమొరీ కాంటెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. హెల్ప్‌లైన్ కోసం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు 040–35717915, 9440488571 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. సైకలాజికల్ రాష్ట్ర స్థాయి హెల్ప్‌లైన్ లోగోను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment