వర్క్‌సైట్ స్కూల్ ప్రారంభం
లింగంపేట(ఎల్లారెడ్డి): ముస్తాపూర్‌లో వర్క్‌సైట్ స్కూల్‌ను గురువారం డీఈవో రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటుక బట్టీల వద్ద పనులు చేసే కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్క్‌సైట్ స్కూల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నారుల విలువైన చదువులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రతీ ఏటా ఇట్టుక బట్టీలు, చెరుకు కొట్టే కూలీలు ఉండే ప్రాంతాల్లో వర్క్‌సైట్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటుక బట్టీల నిర్వాహకులు ప్రతీ రోజు చిన్నారులు పాఠశాలకు వెళ్లే విధంగా చూడాలన్నారు. అనంతరం చిన్నారులకు నోటుబుక్కులు, పలకలు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఎంఈవో షౌకత్‌అలీ, ఏఎంవో వేణుశర్మ, నల్లమడుగు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్‌రావు, ముస్తాపూర్ ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం సుధాకర్, ఇటుక బట్టీల నిర్వాహకుడు సంజీవులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment