‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’
కామారెడ్డి క్రైం: కక్షిదారులు శనివారం నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సింధు శర్మ సూచించారు. రాజీ కుదుర్చుకోదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ నిర్వాహణ, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ తదితర కేసులు ఉంటాయని పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకోదగిన అన్ని రకాల కేసులను మెగా లోక్ అదాలత్ ద్వారా వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కోర్టు విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
దివ్యాంగులపై సానుకూల
దృక్పథం ఉండాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): దివ్యాంగ విద్యార్థుల విషయంలో సానుకూల ధృక్పథంతో ఉండా లని డీఈవో రాజు సూచించారు. తాడ్వాయి మండల కేంద్రంలోని భవిత సెంటర్ ఆవరణలో గురువారం నిర్వహించిన ప్రపంచ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. దివ్యాంగులపై ఎలాంటి వివక్ష చూపవద్దని, దివ్యాంగ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో రామ స్వామి, జిల్లా సెక్టోరియల్ అధికారి వేణు, కో–ఆర్డినేటర్ కృష్ణచైతన్య, ఎంఎన్‌వో రమేష్, స్పెషల్ ఎడ్యుకేటర్లు సురేష్, అంబాదాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాణ్యమైన సోయా
విత్తనాలు అందిస్తాం
వేల్పూర్: రాష్ట్ర రైతాంగానికి నాణ్యమైన సోయా విత్తనాలను అందిస్తామని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌లో అవసరమయ్యే లక్ష క్వింటాళ్ల విత్తనాల కోసం సీడ్ కార్పొరేషన్ అధికారులతో కలిసి బుధ, గురువారాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అన్వేష్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు విత్తనాభివృద్ధి సంస్థను మిగతా రాష్ట్రాల అనుబంధంతో దేశంలో ముందంజలో ఉంచేందుకు ఇండోర్, భోపాల్ ప్రాంతాలను సందర్శించామన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, అధికారులతో సమావేశమై సోయాబీన్ విత్తన ఆవశ్యకత, తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు శనగ, జొన్న, సజ్జ విత్తనాల సరఫరాపై చర్చించామన్నారు. ఇండోర్‌లోని విత్తన శుద్ధి కర్మాగారాన్ని సందర్శించి విత్తన నాణ్యత, ప్యాకింగ్‌ను పరిశీలించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment