నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాక
నిజాంసాగర్: యాసంగి పంటల సాగు అవసరాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను ప్రారంభించడానికి శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రానున్నారు. ఉదయం 10 గంటలకు గోర్గల్ గేటు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల వద్దకు వెళ్తారు.
మంత్రి పర్యటనకు ఏర్పాట్లు
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోర్గల్ గేటు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు పనులను ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ కిషన్, జేఈ వినయ్‌కుమార్ పరిశీలించారు. హెలిప్యాడ్‌తో పాటు మంత్రి పర్యటించే రూట్‌లో బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ, స్థానిక ఎస్సై శివకుమార్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు హెడ్‌స్లూయిస్ వద్ద మంత్రి పర్యటన ఏర్పాట్లను నీటిపారుదలశాఖ సీఈ శ్రీనివాస్, ఈఈ సోలోమాన్ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment