రైతులందరి రుణాలను మాఫీ చేయాలి
కామారెడ్డి అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికి సంబంధించిన రూ. 2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం లింగాపూర్‌లో బీకేఎస్ జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా విఠల్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని పంటలకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.15 వేల రైతు భరోసాను వెంటనే అమలు చేయాలన్నారు. అతివృష్టి, అనావృష్టి నష్టాలకు తగిన పరిహారం ఇవ్వాలన్నారు. ఆయా డిమాండ్ల సాధన కోసం ఈనెల 16న చలో కలెక్టరేట్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులను కోరారు. సమవేశంలో బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నగేష్, జిల్లా కార్యదర్శి శంకర్‌రావు, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి
16న చలో కలెక్టరేట్‌కు పిలుపు
Comments
Please login to add a commentAdd a comment