జిల్లాలో ఇంకా కొన్ని సమస్యలు..
●
● వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సిరిసిల్లకు రైల్వే లైన్ నిర్మాణం భూసేకరణ స్థాయిలోనే ఉంది. అది పూర్తయితే జిల్లాకు రైలు భాగ్యం కలుగుతుంది.
● జిల్లా మీదుగా మంజూరైన జాతీయ రహదారిని కోరుట్ల వరకు పూర్తి చేస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి.
● ఎంపీ పొన్నం ప్రభాకర్ హయాంలో 2013లో సిరిసిల్లకు మంజూరైన 15 పడకల బీడీ కార్మికుల ఈఎస్‌ఐ ఆస్పత్రి ఇంకా నిర్మాణం కాలేదు. భూమి కేటాయించినా భవన నిర్మాణం పెండింగ్‌లో ఉంది.
● సిరిసిల్లలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు, జేఎన్‌టీయూ సొంత భవనం నిర్మించాల్సి ఉంది. జిల్లాలోని ప్రాథకమి, ఉన్నత, జెడ్పీ స్కూళ్లలో మౌలిక వసతులు లేవు.
● కోనరావుపేట మండలం మూలవాగుపై వట్టిమల్ల–నిమ్మపల్లి, బావుసాయిపేట–వెంకట్రావపేట, మామిడిపల్లి–నిజామాబాద్ గ్రామాల మధ్య హైలెవల్ వంతెనలు నిర్మించాల్సి ఉంది.
● సిరిసిల్లలో జిల్లా జనరల్ ఆస్పత్రిలో వసతులు పెంచాలి. నిత్యం వెయ్యి మంది రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతుండగా ఆ స్థాయిలో వసతులు లేవు.
● సిరిసిల్ల, వేములవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ప్రతిపాదనల్లోనే ఉంది.
● చందుర్తి– మోత్కురావుపేట రహదారి నిర్మించాలి. వేములవాడ–సిరికొండ (నిజామాబాద్ జిల్లా) రహదారిని ఫోర్‌లేన్‌గా విస్తరించాలి. మానాల– మరిమడ్ల రోడ్డు పూర్తి చేయాలి.
● సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో విలీనమైన 12 గ్రామాల ప్రజలు విలీన బంధం వీడిపోవాలని ఆశిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
● మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించి ఉపాధి చూపాలి.
● జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ గోదాములు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
● యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు స్థాపిస్తే గల్ఫ్ వలసలు తగ్గుతాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
విప్ చొరవతో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. వేములవాడ పట్టణ అభివృద్ధి, మధ్యమానేరు నిర్వాసితులకు ఇళ్ల మంజూరు, సిరిసిల్ల నేతన్నలకు నూలు డిపో, కలికోట సూరమ్మ చెరువుకు, కోనరావుపేట మండలం లచ్చపేట చెరువు భూసేకరణకు ఇలా అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి.
సీఎంపై ఆశలు
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్న సందర్భంగా ప్రధాన సమస్యలు పరిష్కరిస్తారనే ఆశలు ఉన్నాయి. జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment