నా భర్తను రప్పించండి
బోయినపల్లి(చొప్పదండి): అనార్యోగంతో ఇబ్బంది పడుతూ బహ్రెయిన్‌లో మగ్గుతున్న తన భర్తను స్వదేశానికి రప్పించాలని రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన మంజుల అధికారులను వేడుకుంది. హైదరాబాద్ ప్రవాసీ ప్రజావాణిలో శుక్రవారం వినతిపత్రం అందించింది. మంజుల తెలిపిన వివరాలు. తన భర్త నర్సింలు ఓ ఏజెంట్ మాటలు నమ్మి సెక్యూరిటీగార్డు ఉద్యోగమని రూ.3లక్షలు అప్పుచేసి 9 నెలల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక అది విసిట్ విసా అని సెక్యూరిటీగార్డ్ ఉద్యోగం కాదని తెలిసింది. అంతేకాకుండా సందరు ఏజెంట్ నర్సింలును అక్కడి రబ్బా ప్రాంతంలోని ఓ ఖలీఫా ప్యాలెస్‌లో లేబర్ పనులకు నియమించాడు. ఈ విషయాన్ని నర్సింలు ఫోన్‌లో కుటుంబ సభ్యులకు తెలిపాడు. కొద్ది రోజుల తర్వాత అనారోగ్యం బారిన పడ్డాడు. అయినా బలవంతంగా పనులు చేయిస్తున్నారని నర్సింహులు ఏడుస్తూ ఫోన్‌లో భార్య మంజులకు తెలిపాడు. దీంతో మంజుల హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణి సెల్‌లో శుక్రవారం వినతిపత్రం ఇచ్చింది. నర్సింహులును రప్పించే విషయంలో విదేశీ వ్యవహారాలశాఖ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్పినట్లు మంజులతో వెళ్లిన సింగిల్‌విండో చైర్మన్ దుర్గారెడ్డి తెలిపారు.
ఖలీఫా ప్యాలెస్‌లో
లేబర్‌గా పనిచేస్తున్నాడు
మల్లాపూర్ మహిళ వేడుకోలు
హైదరాబాద్
ప్రవాసీ ప్రజావాణిలో వినతి
Comments
Please login to add a commentAdd a comment