మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్‌క్రైం: భారత న్యాయవాదుల సంఘం(ఐఏఎల్) రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఈనెల 30, డిసెంబర్ 1న హన్మకొండలో నిర్వహిస్తున్నట్లు ఐఏఎల్ రాష్ట్ర నాయకుడు మర్రి వెంకటస్వామి తెలిపారు. ఈమేరకు కరీంనగర్ జిల్లా కోర్టులో శుక్రవారం వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. న్యాయవాదుల రక్షణకు చట్టాలు తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన న్యాయవాదుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, జూనియర్ న్యాయవాదులకు ప్రతీ నెల రూ.5వేలు స్టైఫండ్ ఇవ్వాలని, హెల్త్‌కార్డులను రూ.10లక్షలకు పెంచాలని, హౌసింగ్ సొసైటీ కింద ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. హనుమకొండలో నిర్వహించే మహాసభల్లో న్యాయవాదాల డిమాండ్లు నెరవేర్చుకునేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు సత్యనారాయణ, మురహరి రావు, బాలకృష్ణారావు, లక్ష్మణ్‌రావు, వేణుగోపాల్, న్యాయవాదులు వివేకానంద, శంకరయ్య, రేణుక, మహేందర్, ఆంజనేయులు, రాజశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment