
దళారుల చేతిలో మోసపోవద్దు
గంగాధర/రామడుగు: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకోకుండా మద్దతు ధర పొంది ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం, రామడుగులో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, డీసీవో రామానుజాచా ర్యులు, సివిల్ సప్లై డీఎం రజినీకాంత్, గంగాధర సింగిల్‌విండో చైర్మన్ వెలిచాల తిరుమల్‌రావు, తహసీల్దార్ అనుపమ, గోపాల్‌రావుపేట మార్కె ట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల, వైస్ చైర్మన్ పిండి సత్యంరెడ్డి, రామడుగు, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్లు వీర్ల వేంకటేశ్వర్‌రావు, ఒంటెల మురళీకృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమి టీ చైర్మన్ ఉప్పుల అంజనీప్రసాద్ పాల్గొన్నారు.
మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలి
కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం
పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం