న్యూసెన్స్ జంట వైరల్
బనశంకరి: బైకు పెట్రోల్‌ట్యాంక్ పై కూర్చున్న యువతి తో రొమాన్స్ చేస్తూ బైకు నడపడం ,వాటేసుకునే వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. ఈ జంట పని వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయనే ఆందోళన వ్యక్తమైంది. వీడియోలో ట్రాఫిక్ రద్దీ సమయంలో హెల్మెట్ లేకుండా జంట బైకుపై వెళ్తోంది. పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చున్న యువతి, యువకుడు చనువుగా ఉన్నారు. ఆ బైక్ తమిళనాడు నంబరుతో ఉంది. కొందరు జంటలు ఇంటర్నెట్‌లో వైరల్ కావాలని ఇలాంటి విన్యాసాలు చేస్తుంటారు.
యడ్డి 82వ పుట్టినరోజు
యశవంతపుర: భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తామని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. ఆయన గురువారం 82వ పుట్టినరోజును నగరంలోని డాలర్స్ కాలనీలోని నివాసంలో ఆచరించారు. తనయులు విజయేంద్ర, రాఘవేంద్ర, పార్టీ నాయకుల సమీక్షంలో కేక్‌ను కట్ చేశారు. బీజేపీని గద్దెనెక్కించడానికి రాష్ట్రవ్యాప్తంగా అభియానను నిర్వహిస్తామన్నారు. ప్రతి జిల్లాలో కార్యకర్తల సమావేశాలు జరుపుతామని అన్నారు. రాష్ట్రంలో లింగాయత నాయకుడు ఒక్క యడియూరప్ప మాత్రమేనని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ ప్రముఖులు ఫోన్, సోషల్ మీడియా ద్వారా యడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
జాతరకు వచ్చి పరలోకాలకు
యశవంతపుర: బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన హాసన్ జిల్లా సకలేశపుర పట్టణంలో జరిగింది. సకలేశపుర తాలూకా వళలహళ్లికి చెందిన ఆకాశ్ (22), శంకర్ (45)లు సకలేశపురలో సకలేశపురస్వామి జాతరలో పాల్గొని తిరిగి వెళ్తున్నారు. వెనుక నుంచి వచ్చిన లారీ బైకును ఢీకొంది. తీవ్ర గాయాలైన ఇద్దరూ అక్కడే మరణించారు. లారీ డ్రైవర్ అతి వేగం, అజాగ్రత్త కారణమని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
న్యూసెన్స్ జంట వైరల్
Comments
Please login to add a commentAdd a comment