రోడ్డు పక్కన నల్ల చిరుత పిల్ల
శివమొగ్గ: నగరానికి సమీపంలోని త్యావరెకొప్ప పులులు– సింహధామానికి కొత్త అతిథి వచ్చింది. తల్లి నుంచి వేరై ఆహారం లేక చావు అంచుల్లో ఉన్న నల్ల చిరుత పిల్లని సఫారీకి తెచ్చి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం కార్వార జిల్లా హొన్నావర తాలూకాలోని కతగాల అటవీ రేంజ్‌లో సుమారు ఏడాది వయస్సుగల చిరుత పిల్ల కనిపించింది. హొన్నావర–కుమట మధ్య రోడ్డు వంతెన వద్ద నిద్రించింది. తల్లి లేక ఆహారం దొరక్క నీరసించింది. దీనిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించగా, డీసీఎఫ్ యోగీష్ తమ సిబ్బందితో వచ్చి దానిని లయన్ సఫారీకి తరలించారు. కోలుకోవడానికి ఇంజెక్షన్లు, ఔషధాలు ఇచ్చారు. అలాగే పాలు పట్టారు. క్రమంగా చిరుత పిల్ల కోలుకుంటోంది. ఇప్పటికే లయన్ సఫారీలో మించు పేరుతో ఆడ నల్ల చిరుత ఉంది. మళ్లీ అరుదైన నల్ల చిరుత దొరకడం పట్ల జూ సిబ్బంది సంతోషం వ్యక్తంచేశారు.
శివమొగ్గ పులి ధామకు తరలింపు
రోడ్డు పక్కన నల్ల చిరుత పిల్ల
Comments
Please login to add a commentAdd a comment