గ్యారంటీల కోసం వేల కోట్లు పక్కదారి
మైసూరు: అణగారిన వర్గాల అభివృద్ధి కోసం చట్ట ప్రకారం కేటాయించిన రూ.25 వేల కోట్లను గ్యారంటీ పథకాలకు వాడుకున్న సీఎం సిద్దరామయ్య ప్రభుత్వానిది చట్ట ఉల్లంఘన అని బీజేపీ మాజీ మంత్రి బీ.శ్రీరాములు విమర్శించారు. ఆయన గురువారం నగరంలోని చామరాజపురంలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. అణగారిన వర్గాల పథకాల కోసం కేటాయించిన నిధులను ఇతర ఉద్దేశాలకు వాడుకోరాదనే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. ఖజానా ఖాళీ అయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. అన్ని నిత్యావసరాలపై పన్నులను పెంచిందన్నారు. గ్యారంటీల పేరుతో ఒక చేత్తో ఇస్తూ మరొక చేతితో లాక్కొంటూ ప్రజలను భిక్షకులను చేసిందన్నారు.
బీజేపీలో అసమ్మతి లేదు
పార్టీ ఎలాంటి గ్రూపులు, అసమ్మతి, తిరుగుబాటు లేదని, అయితే కొంత మంది నాయకుల్లో ఉన్న అసంతృప్తిని పార్టీ అధినాయకత్వం సరి చేస్తుందని శ్రీరాములు అన్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావడమే అందరి ఏకై క ఉద్దేశమని అన్నారు. ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స, బీజేపీ నగరాధ్యక్షుడు ఎల్.నాగేంద్ర, పార్టీ ప్రముఖులు చిదానంద చలవాది, గిరిధర్, సందేశ్ స్వామి పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కారుపై మాజీ
మంత్రి శ్రీరాములు విమర్శ
Comments
Please login to add a commentAdd a comment