మోసకారి బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మోసకారి బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్ట్‌

Apr 8 2025 10:54 AM | Updated on Apr 8 2025 10:54 AM

మోసకా

మోసకారి బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్ట్‌

ఖాతాదారులకు తెలియకుండా

రూ.10 కోట్ల మేర టోపీ

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో వెలుగు చూసిన ఉదంతం

రాయచూరు రూరల్‌: బంగారు రుణాలు పొందిన ఖాతాదారులకు బ్యాంక్‌ మేనేజర్‌ రూ.10 కోట్ల మేర మోసం చేసిన ఉదంతంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర శాఖ మేనేజర్‌ నరేంద్ర రెడ్డిని శ్రీశైలంలో అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. రాయచూరు శాఖలో విధులు నిర్వహిస్తూ ఖాతాదారులకు తెలియకుండా 105 మంది ఖాతాదారుల పేరు మీద రుణాల రికార్డుల్లో రూ.10.67 లక్షల మేర కుచ్చు టోపీ పెట్టి పరారయ్యారు. 29 బినామి ఖాతాదారుల పేరు మీద బంగారు నగల రుణాలను బదిలీ చేశారన్నారు. నరేంద్రరెడ్డి 8 మంది కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేశారని తెలిపారు. హుబ్లీ రీజనల్‌ మేనేజర్‌ సుచేత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారన్నారు.

జూన్‌లో ముంగారు ఉత్సవాలు

రాయచూరు రూరల్‌: నగరంలో జూన్‌ నెలలో ఐదు రోజుల పాటు ముంగారు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి వెల్లడించారు. జూన్‌ 8 నుంచి 12వ తేదీ వరకు ముంగారు మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో చేపట్టే ముంగారు సాంస్కృతిక ఉత్సవాలను చేపట్టడానికి సమాజం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభమై 25 ఏళ్లు కానున్న సందర్భంగా ఉత్సవాలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఘనంగా హనుమంతుని జాతర ఉత్సవాలు

హుబ్లీ: బిడనాళలో హనుమంతుని ఆలయ కమిటీ అధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 13 వరకు హనుమంతుని జాతర ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు మరిగమ్మ ఆలయం వద్ద ఆధ్యాత్మిక ప్రవచనం సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. హుబ్లీ శాంతాశ్రమం అభినవ సిద్దరూఢ స్వామి ప్రవచన కార్యక్రమానికి శుభారంభం పలికారు. హావేరి హుక్కేరి మఠం సదాశివ స్వామి సాన్నిధ్యం వహించారు. మంగళవారం గ్రామ దేవత పూజ, 10న ఉదయం 7.30 గంటలకు హనుమంతునికి వెండి కవచం, తేరు కలశం, ప్రదర్శన నిర్వహించనున్నారు. 11న ప్రవచన మంగళోత్సవం జరగనుంది. మనకవాడ అన్నదానేశ్వర మఠం అభినవ మృత్యుంజయ స్వామి సాన్నిధ్యం వహించనున్నారు. 12న ఉదయం హనుమంతునికి ఊయలోత్సవం ఆ తర్వాత ధార్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు హనుమంతుని రథోత్సవం జరగనుంది. రుద్రాక్షిమఠం బసవలింగ స్వామి, మూరుసావిర మఠం జగద్గురు డాక్టర్‌ గురుసిద్ద రాజయోగేంద్ర స్వామి పాల్గొననున్నారు. 13న ఉదయం కడుబిన కాళగతో పాటు మహిళలతో ప్రత్యేకంగా రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.

నాలుగుకు పెరిగిన

కారు ప్రమాద మృతులు

హుబ్లీ: నగర శివారులోని జాతీయ రహదారిపై నూల్వి క్రాస్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో కారు ప్రమాద మృతుల సంఖ్య నాలుగుకు పెరిగినట్లయింది. కారు డ్రైవర్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ఉన్న లింగరాజనగర నివాసులు సుజాత హిరేమఠ(60), శకుంతల హిరేమఠ(72), గాయత్రి (67), ఘటన స్థలంలో చనిపోగా గాయపడిన సంపత్‌ కుమార్‌(68) చికిత్స పొందుతూ కేఎంసీ ఆస్పత్రిలో కన్నుమూశారు. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ వీరబసయ్య హిరేమఠకు (65) చికిత్స కొనసాగుతోంది. కాగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

రైలు పట్టాలపై వ్యక్తి

మృతదేహం

హొసపేటె: హొసపేటె, మునిరాబాద్‌ రైలు స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై సుమారు 50 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు బళ్లారి రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతుడు 5.6 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, సాధారణ శరీరాకృతి, గోధుమ రంగు శరీరఛాయ, పొగవాటి ముక్కు, విశాలమైన నుదురు, 2 అంగుళాల తెలుపు, నలుపు మిశ్రిత జట్టు, చిన్న మీసం కలిగి కాలర్‌ మీద ఎంఆర్‌ అనే లేబుల్‌ ఉంది. నీలం రంగు ఫుల్‌ ఓవర్‌ షర్ట్‌, తెల్లటి ఆఫ్‌ వైట్‌ వెస్ట్‌, గోధుమ రంగు ప్యాంటు, ఆకు పచ్చ చారల రుమాలు, గోధుమ రంగు లోదుస్తులు, నడుము చుట్టు గోధుమ రంగు బెల్ట్‌ ధరించి ఉన్నాడు. మృతుడి వారసులు ఎవరైనా ఉంటే రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను లేదా 9480802131 నెంబరులో సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు.

మోసకారి బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్ట్‌1
1/2

మోసకారి బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్ట్‌

మోసకారి బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్ట్‌2
2/2

మోసకారి బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement