
బాలిక కిడ్నాప్, అత్యాచారం, హత్య
హుబ్లీ: మహిళలు, చిన్నారులపై కామాంధుల దాడులు ఆగడం లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట వేధింపుల ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య నగరి హుబ్లీలో కిరాతకం సంభవించింది. ఐదేళ్ల బాలిక ఓ కామాంధునికి దారుణానికి బలైంది. బాలికను కిడ్నాప్‌చేసి, అత్యాచారం చేసి ఆపై ప్రాణాలు తీశాడో నరరూప రాక్షసుడు. దీంతో స్థానిక ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. దుండగున్ని తక్షణం శిక్షించాలని బృహత్ ధర్నా నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఏం జరిగింది?
వివరాలు.. కొప్పళకు చెందిన ఓ కుటుబం విశ్వేశ్వర నగరలో నివసిస్తోంది. భర్త పెయింటర్‌గా, భార్య ఇళ్లలోను, ఓ బ్యూటీపార్లర్‌లోనూ పనిచేసేది, వీరికి ఐదేళ్ల కూతురు ఉంది. తల్లి ఓ ఇంట్లో పనిచేస్తుండగా బాలిక బయట ఆడుకుంటోంది. బిహార్‌కు చెందిన ఓ వలస కూలీ బాలిక మీద కన్నేశాడు. చాక్లెట్ కొనిస్తానని చెప్పి బాలికను దగ్గరలోని ఓ రేకుల షెడ్డులోని టాయ్‌లెట్‌లోకి ఎత్తుకెళ్లాడు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ప్రాణాలు తీసి ఉడాయించాడు. తల్లి బయటకు వచ్చి చూడగా బాలిక కనిపించలేదు. స్థానికులకు చెప్పడంతో అందరూ గాలించగా టాయ్‌లెట్‌లో బాలిక శవం కనిపించింది. దీంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించగా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఠాణాని ముట్టడించిన ప్రజలు
ఈ ఘటనతో విశ్వేశ్వర నగర్‌తో పాటు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలు అట్టుడికి పోయాయి. పోలీసుల అదుపులో ఉన్న కామాంధున్ని తమ స్వాధీనం చేయాలని వందలాది మహిళలు ఆ అశోక్‌నగర ఠాణాని ముట్టడించారు. అంతవరకు కదిలేది లేదని మొండికేశారు. అంతకంతకు జనం పెరగడంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు, మీడియావారు చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ ఇంటి వద్ద ఆటలాడుతున్న చిన్నారిని సదరు యువకుడు చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాలిక శవాన్ని కేఎంసీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. కామాంధునికి వైద్య పరీక్షలు చేపట్టామన్నారు. ప్రజలతో కమిషనర్ మాట్లాడి నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
హుబ్లీ నగరంలో ఘోరం
వలస కూలీ కిరాతకం
వెల్లువెత్తిన ప్రజాగ్రహం, ధర్నా

బాలిక కిడ్నాప్, అత్యాచారం, హత్య

బాలిక కిడ్నాప్, అత్యాచారం, హత్య

బాలిక కిడ్నాప్, అత్యాచారం, హత్య