విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Published Fri, Nov 22 2024 12:24 AM | Last Updated on Fri, Nov 22 2024 12:24 AM

విధుల

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకంతో వచ్చే వారితో మర్యాదగా వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్యం అందించాలని.. అలాకాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ హెచ్చరించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆరోగ్యశ్రీ ఇన్‌పేషంట్‌ విభాగం, ఓపీ విభాగం, డైట్‌ రూంలో రిజిస్టర్లు పరిశీలించి రోజువారీ వైద్యసేవలు, ఎందరికి భోజనం సమకూరుస్తున్నారో తెలుసుకున్నారు. ఆతర్వాత డ్రగ్‌ స్టోర్‌కు వెళ్లగా రిజిస్టర్లలో నమోదు సక్రమంగా నమోదు చేయడం లేదని గుర్తించారు. గతంలోనూ ఫార్మసీ సూపర్‌వైజర్‌కు రెండు సార్లు సూచించినా తీరు మార్చుకోనందున షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ వైద్యులు, ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, మందుల కొరత ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని సూచించారు. మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎస్‌.రాజేశ్వరరావు, ఆర్‌ఎంఓ బి.రాంబాబు తదితరులు ఉన్నారు.

గ్రూప్‌–2 మైనార్టీ

అభ్యర్థులకు మాక్‌ టెస్ట్‌లు

ఖమ్మంమయూరిసెంటర్‌: గ్రూప్‌–2 పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ(ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్‌, పార్శి, బౌద్ధులు) అభ్యర్థులకు ఉచిత ఆఫ్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. వచ్చేనెల 2, 3, 9, 10వ తేదీల్లో తెలంగాణ మైనార్టీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యాన పరీక్షలు ఖమ్మంలో ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 29లోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, వివరాలకు 97040 03002 నంబర్‌లో సంప్రదించాలని సత్యనారాయణ సూచించారు.

కోర్సుల్లో ప్రవేశానికి

25, 30న కౌన్సెలింగ్‌

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోని వివిధ కోర్సుల్లో ప్రవేశానికి రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎస్‌.రాజేశ్వరరావు తెలిపారు. రెండేళ్ల కాలపరిమితితో డిప్లొమా ఇన్‌ అనస్తీషియా, మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కళాశాలలో కౌన్సెలింగ్‌ ఉంటుందని వెల్లడించారు. ఈనెల 25, 30వ తేదీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత, ఎంపీసీ విద్యార్థులకు ఆ తదుపరి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

అసంక్రమణ వ్యాధుల కట్టడికి కృషి

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో అసంక్రమణ వ్యాధుల కట్టడికి వైద్య సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి ఆదేశించారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల వైద్యులు, సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో గురువారం సమీక్షించిన ఆమె పలు అంశాలపై సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో సిబ్బంది వివరాల నమోదులో వేగం పెంచి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మాతా శిశు సంక్షే మం, వ్యాక్సినేషన్‌, ఆన్‌లైన్‌ నమోదును సూపర్‌వైజర్లు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సత్యేంద్రనాధ్‌ మాట్లాడుతూ లక్ష్యాల సాధనపై వైద్యులు దృష్టి సారించాలన్నారు. ఆతర్వాత జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ చందునాయక్‌ పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఎన్‌సీడీ పీఓ డాక్టర్‌ రామారావు, డెమో సాంబశివరెడ్డి, హెచ్‌ఈఓ సత్యనారాయణ, హెచ్‌ఈ మురళి తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌చార్జ్‌ ఏసీగా రాములు

ఖమ్మం సహకారనగర్‌: డీఈఓ కార్యాలయంలో పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ)గా బి.రాములుకు బాధ్యతలు అప్పగించా రు. ఇన్నాళ్లు ఏసీగా ఉన్న ధనా సెలవుపై వెళ్లటంతో రఘునాథపాలెం ఎంఈఓ రాములుకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యా యి. కాగా, విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ పరిజ్ఞానం పెంచేందుకు ప్రారంభించిన ‘వీ కెన్‌ లెర్న్‌’ కార్యక్రమాన్ని రెండో దశగా 17 పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలల ఇంగ్లిష్‌ ఉపాధ్యాయులకు శుక్రవారం శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
1
1/1

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement