ఊరూరా సన్నాలే..
2.62లక్షల ఎకరాల్లో సన్నాల సాగు
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, బోనస్‌తో రైతాంగం సన్నరకాల సాగుకు ప్రాధాన్యత ఇచ్చింది. వర్షాలు సమృద్ధిగా కురవడం, జలాశయాల్లో నీరు ఉండడమే కాక సాగర్ జలాలు సైతం విడుదలయ్యాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. జిల్లాలో మొత్తం 2,81,991 ఎకరాల్లో వరికి గాను సన్న రకాలే 2,62,230 ఎకరాల్లో సాగయ్యాయి. దొడ్డు రకాలను 19,761 ఎకరాలకే రైతులు పరిమితం చేశారు. ఈ మొత్తం ద్వారా 67,74,500 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాతో రైతుల అవసరాలు, మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు పోగా 42,96,300 క్వింటాళ్ల ధాన్యం సేకరణకు అధికారులు సిద్ధమయ్యారు.
మద్దతు ధర, బోనస్‌తో..
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ వరి ధాన్యం రకం క్వింటాకు రూ.2,300 కనీస మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్–ఏ(సన్న రకం) ధాన్యానికి రూ.2,320గా ప్రకటించగా.. రాష్ట్రప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని వెల్లడించింది. దీంతో సన్న రకాల వైపే రైతులు మొగ్గు చూపగా.. మద్దతు ధర, బోనస్ కలిపి క్వింటా సన్నరకం ధాన్యానికి రూ.2,820 లభించనుంది. ఇక బహిరంగ మార్కెట్ కన్నా ప్రభుత్వ మద్దతు ధర ఎక్కువగా ఉండడం, బోనస్ కూడా చెల్లించనున్న అంశంపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాక కొనుగోలు కేంద్రాలను కూడా దొడ్డు, సన్న రకాలకు వేర్వేరుగా ఏర్పాటుచేశారు. ఫలితంగా పదిహేను రోజుల క్రితం మొదలైన కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.
ఇప్పటివరకు 2,80,895 క్వింటాళ్లు
జిల్లాలో డీసీఎంఎస్, డీఆర్‌డీఏ, పీఏసీఎస్ ఆధ్వర్యాన 330కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. గత 15 రోజులుగా ఈ కేంద్రాలకు ధాన్యం వస్తోంది. ఇప్పటి వరకు 3,773మంది రైతుల నుంచి 2,80,895 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా ఇవన్నీ సన్నరకాలే కావడం విశేషం. మొత్తం 38,90,530 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని సేకరించాలని అధి కారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కాగా, దొడ్డు రకాలను నామమాత్రంగానే సాగు చేయడంతో రైతులు కేంద్రాలకు తీసుకురావడం లేదని తెలు స్తోంది. వచ్చే ఏడాది నుంచి రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి నిర్ణయించిన ప్రభుత్వం ముందస్తుగా కల్పించిన అవగాహనతో రైతులు ఇటే మొగ్గు చూపారు. పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజ నానికి సన్న బియ్యమే కేటాయించనున్నారు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు సన్నరకం ధాన్యమే వస్తోంది. ప్రభుత్వం ముందస్తు ప్రకటనతో ఈ ఏడాది ఖరీఫ్‌లో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఎక్కువగా ఈ రకాలే సాగు చేశారు. జిల్లా అంతటా సాగైన వరిలో దాదాపు 93 శాతం సన్నరకాలే ఉండగా.. అదే ధాన్యం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. శుక్రవారం నాటికి 2,80,895 క్వింటాళ్ల ధాన్యం
తీసుకొచ్చారు.
–సాక్షిప్రతినిధి,
ఖమ్మం
కొనుగోలు కేంద్రాలకు ఈ రకం ధాన్యమే ఎక్కువ
సాగైన వరిలోనూ 93 శాతం ఇవే..
ఇప్పటి వరకు
2,80,895 క్వింటాళ్ల సేకరణ
మద్దతు ధర, బోనస్‌తో రైతుల ఆసక్తి
Comments
Please login to add a commentAdd a comment