కుటుంబ సర్వే 75.15 శాతం పూర్తి
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గురువారం నాటికి 75.15శాతం పూర్తయిందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించా రు. క్యాంపు కార్యాలయానికి శుక్రవారం వచ్చిన ఎన్యుమరేటర్లకు ఆయన తన వివరాలు వెల్లడించి నమోదు చేయించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5,67,338 ఇళ్లకు గాను 4,26,333 ఇళ్లలో సర్వే పూర్తయిందని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గంలో 54.96 శాతం, పాలేరులో 80.93, మధిరలో 80.66, వైరాలో 88.54, సత్తుపల్లి నియోజకవర్గంలో 88.54శాతం పూర్తయిందని తెలిపారు.
ట్రాన్స్‌జెండర్ల ఉపాధికి సహకారం
ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేలా సహకరి స్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో ట్రాన్స్‌జెండర్లతో సమావేశమైన ఆయన మా ట్లాడుతూ ఆధార్ కార్డుల జారీ, పేరు మార్పు, అర్హులకు రేషన్ కార్డులు, ఒంటరి మహిళా కోటా కింద పెన్షన్ల మంజూరుకు కృషి చేస్తామన్నారు. అలాగే, ఖమ్మంలో రెండు చోట్ల క్యాంటీన్లకు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి, డీఆర్డీఓ ఎస్.సన్యాసయ్య, డీఆర్వో ఎం.రాజేశ్వరి పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తత
ఖమ్మంరూరల్: వాతావరణ పరిస్థితుల్లో మార్పు నేపధ్యాన హాస్టళ్ల విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం రూరల్ మండలం జలగంగనగర్‌లోని మైనార్టీ బాలుర గురుకులాలన్ని తనిఖీ చేసిన ఆయన హాస్టల్, తరగతి గదుల, వంట గదదిని పరిశీలించి బోధన, భోజనం, తాగునీటి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు తాజా సరుకులు, కూరగాయాలతో చేసిన భోజనం అందించడమే కాక అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే చికిత్స చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే, స్నానానికి వేడినీటి కోసం హీటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు జావేద్, ఇందిర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు నమోదు చేయించుకున్న
కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
Comments
Please login to add a commentAdd a comment