ధాన్యం కొనుగోళ్లు, కార్యాలయాల్లో తనిఖీ
తల్లాడ: తల్లాడలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ శుక్రవారం తనిఖీ చేశారు. పీహెచ్‌సీకి వెళ్లిన సమయంలో ఫార్మసిస్ట్ లేకపోవడం, సిస్టర్ మందులు ఇస్తుండడంతో వైద్యాధికారి రత్న మనోహర్‌ను ప్రశ్నించారు. ఫార్మసిస్ట్ వారం క్రితం పది రోజుల పాటు సెలవు కావాలని లేఖ ఇస్తే మంజూరు చేయకున్నా రావడం లేదన్నారు. ఈ విషయాన్ని డీఎంహెచ్‌ఓకు చెప్పారా అని ఆరా తీయగా చెప్పలేదనగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక మందులు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయనందున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆతర్వాత తల్లాడ సొసైటీ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం, ప్రాథమిక పాఠశాలల్లో తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎంపీడీఓ చంద్రమౌళి, ఎంపీఓ కె.శ్రీదేవి, ఎంఈఓ దామోదరప్రసాద్, సొసైటీ సీఈఓ నాగబాబు, సూపర్‌వైజర్ పెద్ద పుల్లయ్య, సీహెచ్‌ఓ భాస్కర్ పాల్గొన్నారు.
విధులు పక్కాగా నిర్వర్తించాలి
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీల సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించేలా అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ భవన నిర్మాణాలకు నిబంధనల మేరకు అనుమతులు జారీ చేయాలని, వంద శాతం పన్ను వసూలు చేయాలని తెలిపారు. అలాగే, సెల్ టవర్ల అనుమతులు, పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బందికి వేతనాలపై సూచనలు చేశారు. డీపీఓ ఆశాలత, డీఎల్‌పీఓ రాంబాబు, ఎంపీడీఓలు, ఎంపీఓఓలు పాల్గొన్నారు.
పీహెచ్‌సీలో లోపాలపై అదనపు కలెక్టర్ ఆరా
Comments
Please login to add a commentAdd a comment