రాష్ట్ర ముఖ్యమంత్రి పంటల ధరలను వదిలేసి మద్యం అమ్మకాలపై సమీక్ష చేయడం
గర్హనీయమని హరీశ్‌రావు మండిపడ్డారు. మద్యం అమ్మకాలు తగ్గాయని రాష్ట్రంలో
35 మంది అధికారులకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం, పంటల ధరలు తగ్గడంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు తపించారని హరీశ్‌రావు తెలిపారు. కాగా, మార్కెట్‌లో మాజీ
మంత్రుల పర్యటన సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదనను వెల్లడించారు. రఘునాథపాలెం మండలం పంగిడి రైతు లకావత్ రామా పత్తి దిగుబడి తగ్గగా, క్వింటాకు రూ.6,500కు మించి ధర లభించడం లేదని వాపోయారు. అలాగే, సూర్యాపేట జిల్లా మోతె మండలం రాపాలకు చెందిన మహిళా రైతు బానోత్ కమల మాట్లాడుతూ సాగు ఖర్చులు పెరిగినా పత్తికి కనీస ధర రావడం లేదని గోడు వెళ్లబోసుకుంది. కొణిజర్ల
మండలం అమ్మపాలెంకు జడ వీరబాబు పత్తి సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని ఆవేదనగా చెప్పారు. సీసీఐ కేంద్రాల్లో రైతుల నుంచి కాకుండా దళారుల వద్దే పత్తి కొనుగోలు
చేస్తున్నారని, రైతుబంధు ఊసే లేదని తెలిపారు. చింతకాని మండలం నామారానికి చెందిన చాంద్ బీ మాట్లాడుతూ పత్తి సాగు చేసిన తమను అధిక వర్షాలు దెబ్బతీయగా, కనీస ధర లేకపోవడంతో మరింత నష్టం వస్తోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment