ఖమ్మం సహకారనగర్/మధిర: ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను ఆదివారం మధిర మండలం దెందుకూరులోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈమేరకు అలేఖ్య సారథ్యంలోని కళాబృందం ఆధ్వర్యాన ఏడాది కాలంలో సాధించిన విజయాలపై ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. కాగా, దెందుకూరులో ఆదివారం సాయంత్రం 6గంటలకు మొదలయ్యే విజయోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. అలాగే, ఇతర మంత్రులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఓ ప్రకటనలో కోరారు.
దెందుకూరులో నిర్వహణకు ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment