
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
సత్తుపల్లిటౌన్: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ములగలపాటి వారిగూడెంకు చెందిన కంటి వెంకటనారాయణ(70) బైక్‌పై సోమవారం వేంసూరు మండలం కుంచపర్తి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
లారీ ఢీకొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయాలు
పెనుబల్లి: సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఘటన పెనుబల్లిలో సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని చౌడవరం గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సడియం వంశీ వీఎం బంజర్ జెడ్పీహెచ్‌ఎస్ నుంచి మధ్యాహ్నం పాఠశాల ముగిశాక సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నాడు. పెనుబల్లి ఆర్యవైశ్య కల్యాణ మండపం వద్ద ఆయనను కొత్తగూడెం వైపు నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో నడుము వద్ద తీవ్రగాయాలయ్యాయి. దీంతో వంశీని కానిస్టేబుళ్లు రాజమల్లు, పుల్లయ్య, డ్రైవర్ వీర రాఘవులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు.