వ్యవసాయ అనుబంధ రంగాలపై శిక్షణ
వాంకిడి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ పనుల్లో వంద రోజులు పూర్తిచేసుకున్న కూలీలకు బుధవారం ఉన్నతి ప్రాజెక్టులో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం(బెల్లంపల్లి) వ్యవసాయ శాస్త్రవేత్తలు శివకృష్ణ, తిరుపతి, నాగరాజు శిక్షణ కల్పించారు. డీఆర్‌డీవో దత్తారావు మాట్లాడుతూ శాసీ్త్రయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే దిగుబడి పెరుగుతుందని సూచించారు. పంట మార్పిడి, భూపరీక్షలు ఆధారంగా పంటలు వేసుకోవడం, అధికారుల సూచనలను పాటించడంతో నష్టాలు తగ్గుతాయని పేర్కొన్నారు. భూసార పరీక్షల కోసం రైతులు బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ట్రైనింగ్ ఇన్‌చార్జి, హెచ్‌ఆర్ మల్లేశ్, ఐకేపీ ఏపీడీ రామకృష్ణ, ఏపీవో శ్రావణ్‌కుమార్, ఏపీఎం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment