పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీ గా నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని బూర్గుడలో బుధ వారం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున జిల్లాకు ఏడు వేల ఇళ్లు మంజూరైనట్లు వెల్లడించారు. దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు ఫొటోలతోపాటు యాప్‌లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ వేణుగోపాల్, జిల్లా మేనేజర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment