విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థుల ఆరోగ్యంపై ప్ర త్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని మోడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, నిత్యావసర స రుకులు, కూరగాయలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలన్నారు. వంట కోసం తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వినియోగించాలని సూచించారు. విద్యార్థినులను మహిళా ఉ పాధ్యాయులు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకో వాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత అవశ్యకతను వివరించాలన్నారు. వసతిగృహాల్లో భోజనశాల, మరుగుదొడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం ధనోరా తెలుగు, ఉర్దూ మీడి యం పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజ నం పరిశీలించారు. ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలన్నారు. ఆయన వెంట డీడీ రమాదేవి, ఏటీడీవో శ్రీనివాస్, ఎంపీడీవో అంజద్‌పాషా, తహసీల్దార్ దత్తుప్రసాద్, ఎస్‌ఈఆర్‌పీ శ్యాంరావు, ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య తదితరులు ఉన్నారు.
మెనూ ప్రకారం భోజనం
అందించాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు క లెక్టర్ దీపక్ తివారి అన్నారు. సిర్పూర్(యూ) మండల కేంద్రంలోని కేజీబీవీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, రికార్డులు, భోజనం, కూరగాయలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించా లన్నారు. తాజా కూరగాయలు వినియోగించాలని, పండ్లు, కోడిగుడ్లు మెనూ ప్రకారం ఇవ్వాలన్నారు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఇందరిమ్మ ఇళ్ల వి వరాల నమోదును పరిశీలించారు. తహసీల్దార్ ఉదయ్‌కుమార్, ఎంపీడీవో కృష్ణారావు, ఎంఈవో సుధాకర్, ఎస్సై రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అవినాశ్ తదితరులు ఉన్నారు.
29న ‘చలో హైదరాబాద్’
ఆసిఫాబాద్‌అర్బన్: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 2,685 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఈ నెల 29న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడా పోరాట హక్కుల పోరాట సమితి రాష్ట్ర అ ధ్యక్షుడు అజ్మీరా పూల్‌సింగ్ నాయక్ డిమాండ్ చేశా రు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో బుధవా రం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 24 ఏళ్లుగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2,100 మంది కాంట్రా క్టు ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 491 మంది కాంట్రాక్టు బోధినేతర ఉద్యోగులు, 94 మంది గిరిజన సహకార సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వీరిని గుర్తించి ఉద్యోగాలను క్రమబద్ధీకరించా లని కోరారు. ఈ నెల 29న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, విజేశ్, పెంటయ్య, రమేశ్, శ్రీని వాస్, ప్రకాశ్, బక్కయ్య, నగేశ్, వెంకటేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment