కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: భవన నిర్మాణ కార్మికుల కు పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా భవన నిర్మాణ కార్మి కులకు ఒరిగింది ఏమి లేదన్నారు. ప్రమదాల కు గురైన కార్మికులకు ఆర్థికసాయం అందించాలన్నారు. రాష్ట్రంలో 25.70 లక్షల మంది కార్మికులు ఉండగా, 10 లక్షల మందిని రె న్యూవల్ చేయలేదన్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐక్యత కోసం మండల కమిటీలతోపాటు జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, అధ్యక్షుడు రాజేందర్, నాయకులు కృష్ణమాచారి, ప్రభాకర్, మురళీ, రమే శ్, ముక్తేశ్వర్, నాగోరావు, పోశం, మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment