క్రీడానైపుణ్యాలు వెలికి తీసేందుకే పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల క్రీడానైపుణ్యాలు వెలికి తీసేందుకే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో గురువారం మున్సిపల్ స్థాయి క్రీడా పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలన్నారు. క్రీడలతో మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు. డీఎస్‌వో మీనారెడ్డి, ఎంఈవో సుభాష్, ఎంపీడీవో శ్రీనివాస్, హెచ్‌ఎం జంగు, పీఈటీ, పీడీలు తిరుపతి, రాకేశ్, రమేశ్, మధుసూదన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment