మళ్లీ చలి..!
తిర్యాణి(ఆసిఫాబాద్): పది రోజుల తర్వాత చలి మళ్లీ మొదలైంది. తుపాను ప్రభావంతో కొద్దిరోజు ల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు ఉండగా, రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతాలతో పాటు వాగులు, నీటి వనరులు ఉన్న జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఈ దురు గాలులతో వృద్ధులు, చిన్నారులతోపాటు ఉ దయం పనులకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
సిర్పూర్(యూ)లో 7.3 డిగ్రీలు
నవంబర్ 30 వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఆ తర్వాత ఫెంగల్ తుపాను ప్రభావంతో 20 డిగ్రీలపైనే ఉండటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. బుధవారం నుంచి మళ్లీ చలి ప్రభావం మొదలైంది. గురువారం రాష్ట్రంలో మూడో అత్యల్ప ఉష్ణోగ్రత ఏజెన్సీ మండలం సిర్పూర్(యూ)లో 7.3 డిగ్రీలు గా నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం విశేషం. అలాగే గురువారం తిర్యాణిలో 8.6, కెరమెరిలో 8.8, వాంకిడిలో 10.1, కెరమెరి మండలం ధనోరాలో 10.2, తిర్యాణి మండలం గిన్నెధరిలో 10.4, జైనూర్ 10.7, కాగజ్‌నగర్‌లో 11.1, రెబ్బెనలో 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రానున్న రోజుల్లో మరింతగా..
జిల్లాలో చలి తీవ్రత సాధారణమే అయినా ఈసారి మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. బుధవారం సిర్పూర్(యూ)లో 9.7 డిగ్రీలుగా నమోదు కాగా, ఒక్కరో జులోనే రెండు డిగ్రీలు పడిపోయి 7.3 డిగ్రీలుగా న మోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కు రిసిన అకాల వర్షాలతో చలి మరింత పెరిగే అవకా శం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి కొన్ని రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు చేరుతాయ ని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఆటో తీయాలంటేనే భయం
చలి తీవ్రత బాగా పెరిగింది. ఉదయం స్వెటర్ వేసుకున్నా ఆటో తీయాలంటేనే భయమేస్తుంది. ఉదయం 8 దాటినా చలి తగ్గడం లేదు. ఉదయం ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గింది.
– తిరుపతి, ఆటోడ్రైవర్, గోలేటి. మం.రెబ్బెన
గజగజ వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు
పలు ప్రాంతాల్లో పదిలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు
ఉదయం 9 గంటలు దాటినా ఈదురుగాలులు
Comments
Please login to add a commentAdd a comment