గ్రూపు– 2 పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూపు– 2 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163(బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్– 2023) అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 18 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ నెల 15న ఉదయం 6 గంటల నుంచి 16న సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి ఉండొద్దన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీ లు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచా రాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జి రాక్సు షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ప్రత్యేక పెట్రోలింగ్ సిబ్బందిని నియమించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment