మరింత చేరువ..!
● నూతన మండలాలకు 108 అంబులెన్సులు కేటాయింపు ● జిల్లాలో 15కు చేరిన మొత్తం వాహనాలు ● గ్రామీణులకు అందుబాటులో అత్యవసర సేవలు
పెంచికల్‌పేట్(సిర్పూర్): జిల్లాలోని మారుమూల మండలాల్లో 108 అంబులెన్స్ అత్యవసర సేవలు మరింత చేరువయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం లింగా పూర్, చింతలమానెపల్లి మండలాలకు కొత్త వాహనాలను మంజూరు చేయడంతో ఆయా ప్రాంతాల్లో 108 అత్యవసర సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో 13 వాహనాలు ఉండగా.. మరో రెండు వాహనాలు కొత్తగా చేరాయి. దీంతో జిల్లాలో 108 అంబులెన్స్‌ల సంఖ్య 15కు చేరింది. ఇందులో 11 వాహనాలు అత్యాధునిక టెక్నాలజీతో అత్యవస ర సమయంలో ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గురువారం వరకు అంబు లెన్స్‌ల ద్వారా 9,825 మందిని ఆస్పత్రులకు తరలించారు. 108 సిబ్బంది 28మంది మహిళలకు సు ఖప్రసవం చేసి ఆపత్కాలంలో అండగా నిలిచారు. గిరిజన గ్రామాలకు నూతన వాహనాలు సమకూరడంతో మరింత వేగంగా సేవలు అందనున్నాయి.
రెండు మండలాల్లో ఇలా..
జిల్లాలో మొత్తం 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన లింగాపూర్ మండలంలో 14 గ్రామ పంచాయితీలు ఉండగా, 42 గ్రామాల పరిధిలో సుమారు 35 వేల జనాభా ఉంది. ఏజెన్సీ మండలం కావడంతో చాలాగ్రామాలు మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో జైనూర్, కెరమెరి మండలాల్లోని 108 వాహనం కోసం ఎదురుచూస్తూ ప్రాణాలను కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. బాధితులను ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రులకు తరలించేవారు. అలాగే చింతలమానెపల్లి మండలంలో 21 పంచాయితీలు ఉన్నాయి. ఇక్కడి గ్రామాలు అటవీ ప్రాంతాలకు సమీపంలో మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. వర్షాకాలంలో ఇక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో సమీపంలోని కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేది. దూరం కారణంగా వాహనాలు వచ్చేందుకు తీవ్ర జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన ఈ రెండు మండలాలకు కొత్త వాహనాలు సమకూర్చడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెంచికల్‌పేట్‌కు ఎప్పుడో..?
జిల్లాలో లింగాపూర్, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్ మండలాలు నూతనంగా ఏర్పడ్డాయి. ఇందులో రెండు మండలాలకు ప్రభుత్వం 108 అంబులెన్సులను సమకూర్చింది. మరో మండలం పెంచికల్‌పేట్‌కు కేటాయించకపోవడంతో మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మారూమూల గిరిజన గ్రామాల్లో గర్భిణులు ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెంచికల్‌పేట్ మండలంలోని మురళీగూడ, జిల్లెడ, నందిగామ, కమ్మర్‌గాం, గుండెపల్లి, జైహింద్‌పూర్, అగర్‌గూడ గ్రామాల ప్రజలకు అత్యవసర పరిస్థితి ఎదురైతే బెజ్జూర్, కౌటాల, దహెగాం, కాగజ్‌నగర్ మండలాల నుంచి వాహనాలు రావాల్సిందే. అక్కడి వాహనాలు బిజీగా ఉంటే ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన దుస్థితి. ఇప్పటికై నా కొత్తగా ఏర్పడిన పెంచికల్‌పేట్ మండలానికి సైతం అంబులెన్స్ వాహనం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలోని రెండు రెండు మండలాలకు ప్రభుత్వం నూతన వాహనాలు మంజూరు చేసింది. ఆయా మండలాల్లో సేవలను ఇప్పటికే ప్రారంభించాం. పెంచికల్‌పేట్ మండలానికి సైతం నూతన అంబులెన్స్ కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. జిల్లాలో వేగంగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.
– కె.సతీష్, 108 ప్రోగ్రాం జిల్లా మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment