విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం అదనపు కలెక్టర్లు దీపక్ తి వారి, డేవిడ్‌తో కలిసి జిల్లాలోని అన్ని వసతి గృహాల ప్రిన్సిపాళ్లు, ప్రత్యేకాధికారులు, వార్డెన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలోని కేజీబీవీ, ఆశ్రమ, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సా రించి మెనూ ప్రకారం భోజనం అందించాలన్నా రు. ప్రభుత్వం డైట్ చార్జీలు 40శాతం, కాస్మెటిక్ చార్జీలు 20శాతం పెంచిన నేపథ్యంలో నాణ్యమై న ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. వంట సరుకులు, గదులు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శుభ్రమైన తాగునీటితోపాటు వంటకు ఉపయోగించే నీటిపై దృష్టి సారించాలన్నారు. స్టాక్ నిల్వ ఉంచొద్దని, బియ్యం సంచులు గోడలకు ఆనుకుని ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న తల్లిదండ్రులను ఆహ్వానించాలన్నారు. మెనూ వివరాలతో ఫ్లెక్సీలు తయారు చేసి భోజనశాల వద్ద ప్రదర్శించాలన్నారు. డీటీడీవో రమాదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, ఇన్‌చార్జి డీఈవో ఉదయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మండలస్థాయి గిడ్డంగి తనిఖీ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో గల మండలస్థాయి గిడ్డంగిని గురువారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తనిఖీ చేశారు. జిల్లాలోని ప్ర భుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. బియ్యం నిల్వలు, రికార్డులు పరిశీలించారు. అనుమతి లేని వాహనాల ద్వారా సరుకులు సరఫరా చేయొద్దని, టెండర్‌లో పేర్కొ న్న వాహనాలు మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. వాహనాలను జీపీఎస్ ట్యాగ్ చేయాల ని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఎస్‌వో వినోద్‌కుమార్, తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే తదితరులు ఉన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Comments
Please login to add a commentAdd a comment