అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో గ్రూపు– 2 పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రూపు– 2 పరీక్ష నిర్వహణ కోసం 18 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. పరీక్ష సమయంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త లక్ష్మీనరసింహ, పరీక్ష కేంద్రాల పర్వవేక్షణ అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్, రూట్ అధికారులు పాల్గొన్నారు. కాగా, జిల్లా కేంద్రానికి ప్రశ్నపత్రాలు చేరగా, కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment