‘కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలు’
ఆసిఫాబాద్‌అర్బన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉపేందర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో గురువారం సంఘం అధ్యక్షుడు దివాకర్ ఆ ధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను యథా విధిగా కొనసాగించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. సివిల్ సప్లై కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలన్నారు. అంగన్‌వాడీ, ఆశలు, మధ్యాహ్న భోజన కా ర్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల ని కోరారు. ఇతర రంగాల్లోని కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై కార్యాలయంలో వినతిపత్రం అందించారు. సుధాకర్, మల్లేశ్, వెంకటేశ్, శ్రీనివాస్, దత్తు, రాజన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment