వైద్యాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని మారుమూల గ్రామాల పేద ప్రజలకు మెరుగైన వైద్యమందించేందుకు ఉన్నతస్థాయి వైద్యాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) నా యకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్లో శుక్రవారం వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం, ఉన్నవారు సమయపాలన పాటించకపోవడంతో పేదలకు సరైన వైద్యం అందడం లేదు. ప్రజల ఆరోగ్యం కా పాడేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్, దినకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment